Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!
ABN , First Publish Date - 2023-11-21T16:52:05+05:30 IST
భారత్‌లో రియల్ మీ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.
![Realme: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రియల్మీ నుంచి మరో కొత్త మోడల్.. ధర ఎంతంటే..!](https://media.andhrajyothy.com/media/2023/20231102/realme_5ce22dcf06.jpg)
భారత్‌లో రియల్ మీ (Realme) ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినప్పటికీ చాలా లీక్‌లు మాత్రం బయటకు వస్తున్నాయి. తాజా అప్డేట్లో ఫోన్ ధర (Price), స్పెసిఫికేషన్లు (Specification) వెల్లడయ్యాయి.
భారతదేశంలో సీ-సిరీస్‌లో Realme C65 5G మొదటి 5G స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్ మూడే వేరియంట్లలో అందుబాటులోకి రాబోతోంది. వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ ధర రూ.12 వేల నుంచి 15 వేల మధ్యలో ఉండొచ్చని అంచనా. 4GB, 6GB, 8GB వేరియంట్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 64GB నుంచి 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండొచ్చు (Realme C65 5G Price).
Funny Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న తాత వీడియో.. గేట్లు తీసే ఉన్నా కూడా ఏం చేశాడో చూస్తే..!
రియల్ మీ కంపెనీ సెప్టెంబర్‌లో Realme C51ని విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. 6.7-అంగుళాల IPS LCS డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.