Share News

Kumaram Bheem Asifabad : ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను:కోనేరు కోనప్ప

ABN , First Publish Date - 2023-11-26T22:50:47+05:30 IST

కాగజ్‌నగర్‌, నవంబరు 26: సిర్పూరు నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా నని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలో తాను చేసిన అభివృద్ధి అంతా చూడాలన్నారు.

 Kumaram Bheem Asifabad :  ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను:కోనేరు కోనప్ప

-సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌, నవంబరు 26: సిర్పూరు నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా నని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలో తాను చేసిన అభివృద్ధి అంతా చూడాలన్నారు. అంతేకాని ఈ ఎన్నికల సమయంలో కల్లిబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ఎస్పీఎం మూసివేసిన సమయంలో ఈ నాయ కులు ఎందుకు స్పందించలేదు? కరోనా సమయం లో అంతా ఎక్కడికి పోయారన్నారు.. తాను ఇక్కడే ఉండి మూసిన ఎస్పీఎంను తెరిపించానన్నారు. కరోనా సమయంలో అందరికి ఉచితంగా కూరగాయలు, భోజనవసతి కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రజల మధ్యలో ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, కోనేరు చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అందించిన సేవా కార్యక్రమాలను చూడాలన్నారు. ఈవీఎంలో 1నెంబరులో కారు గుర్తు ఉందని, తప్పకుండా ఓటేసి అధిక మెజార్టీతో తనను గెల్పించాలని కోరారు. కాగజ్‌నగర్‌ ఒక నాయకుడు హాస్పిటల్‌ తెరిచి అందరి దగ్గర అడ్డగోలుగా డబ్బులువసూలు చేస్తున్నట్టు తెలిపారు. తనపై వ్యక్తిగతఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా ఒక్కొక్క నాయకుడిపై మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరిష్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మారుమూల గ్రామాల అభివృద్ధి

సిర్పూర్‌(టి): బీఆర్‌ఎస్‌తోనే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం మండ లంలోని చీలపల్లి, లింబుగూడ, పూసుగూడ, చిన్న మాలిని, పెద్దమాలిని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే విద్యా, వైద్యం, రోడ్డు తదితర రంగాల్లో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.

ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్పను మరోసారి అధికమెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బ్రహ్మయ్య, భీంరావు, కీజర్‌ హుస్సేన్‌, సత్యనారాయణ, సోహెల్‌ అహ్మద్‌, అబ్దుల్‌అకీల్‌, ఇఫ్పతుస్సేన్‌, శ్రీనివాస్‌, తది తరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ మార్కెట్‌లో కోనేరు రమాదేవి ప్రచారం

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మార్కెట్‌లో ఆది వారం ఎమ్మెల్యే కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారాం తపు సంతలో ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ప్రచారం చేశారు. అనంతరం నమునా ఈవీఎంలతో మొదటి నెంబరులో ఉన్న కారు గుర్తు బటన్‌కు ఓటేయాలని ఓటర్లను కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనప్పను తప్పకుండా గెల్పించాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ ఎమ్మెల్యే కోనప్ప చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఇతర పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ప్రచారంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరీష్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగీర్‌, సీపీ విద్యావతి, బాలు, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T22:50:48+05:30 IST