Share News

Kumaram Bheem Asifabad: నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెస్తా: ఎమ్మెల్యే కోనప్ప

ABN , First Publish Date - 2023-11-28T22:23:58+05:30 IST

కాగజ్‌నగర్‌, నవంబరు 28: నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌ ఈసుగాం నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బైక్‌ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Kumaram Bheem Asifabad: నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెస్తా: ఎమ్మెల్యే కోనప్ప

-సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌, నవంబరు 28: నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌ ఈసుగాం నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బైక్‌ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ పాటలకు యువత డ్యాన్సులు చేశారు. పట్టణమమంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కోనప్ప మాట్లాడారు. సిర్పూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల తీర్చుదిద్దుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ర్యాలీతో ప్రతిపక్షాల నాయకుల గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. లాగులు తడిసిపోయేట్టు అయిందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వచ్చేనెల 3న మనమే టపాసులు పేలుస్తామన్నారు. ఈ బహిరంగ సభలో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కోనేరు వంశీ, ఆయావార్డుల కౌన్సిలర్లు, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T22:24:00+05:30 IST