Share News

Kumaram Bheem Asifabad: అభివృద్ధి చేశాను.. మరోసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కోనప్ప

ABN , First Publish Date - 2023-11-27T22:48:00+05:30 IST

కాగజ్‌నగర్‌/కౌటాల, నవంబరు 27: సిర్పూరు నియోకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని.. ఈ ఎన్నికల్లో తనను ఆదరించి అధిక మెజార్టీతో గెల్పించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం కాగజ్‌నగర్‌ పట్టణం, బారెగూడ, కౌటాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

Kumaram Bheem Asifabad: అభివృద్ధి చేశాను.. మరోసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కోనప్ప

- సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌/కౌటాల, నవంబరు 27: సిర్పూరు నియోకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని.. ఈ ఎన్నికల్లో తనను ఆదరించి అధిక మెజార్టీతో గెల్పించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం కాగజ్‌నగర్‌ పట్టణం, బారెగూడ, కౌటాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్న ఈ నాయకులంతా గత నాలుగేళ్లలో ఎక్కడి పోయారని ప్రశ్నించారు. చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందు ఉందన్నారు. తన సమయమంతా కూడా ప్రజా జీవితానికే అంకితం చేసినట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చేసిన సంక్షేమ పథకాలు, కోనేరు చారిటబుల్‌ ట్రస్టు సేవలను గుర్తించి ఓటేయాలని కోరారు. ఇతర పార్టీలకు ఓటేస్తే ఓటు వృథా అవుతుందన్నారు. తనకు మరొ క్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. కౌటాల సంతలో ఎమ్మెల్యే కుమారుడు కోనేరు వంశీ ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌కు ఓటేసి ఎమ్మెల్యే కోనప్పను అధిక మెజార్టీతో గెల్పించాలన్నారు. ఎమ్మెల్యే కోనప్ప కోడలు మధులిక కౌటాల మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే అందరిని న్యాయం జరుగుతుందన్నారు. ఈవీఎంలో ఉండే మొదటి బటన్‌ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అధిక మెజార్టీతో గెల్పించాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగీర్‌, సీపీ విద్యావతి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరీష్‌, వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వార్డుల్లో కోనేరు రమాదేవి ప్రచారం..

సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పసతీమణి కోనేరు రమాదేవి సోమవారం వివిధ వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే సతీమణికి పూల దండలువేసి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ తన భర్తకో ఓటేసి అధికమెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈవీఎంలోని నం.1ను బటన్‌కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

రైతు బిడ్డను ఆదరించండి: కోనేరు రమాదేవి

బెజ్జూరు: రైతుబిడ్డను మరోసారి ఆదరించాలని ఎమ్మెల్యే కోనప్ప సతీమణి రమాదేవి అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మర్తిడి, కుశ్నపల్లి గ్రామాల్లోఎన్నికల ప్రచారాన్ని నిర్వహిం చారు. ఎమ్మెల్యే కోనప్పను మూడు సార్లు గెలిపిం చిన నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆదరిం చాలని కోరారు. మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే దశలవారీగా పెన్షన్లు రూ.5వేలకు, రైతుబంధు రూ.16వేలకు పెరుగు తుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని మరోసారి ఆదరిస్తే మరింత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని రంగనాయక, శివాలయ, హనుమాన్‌ వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జగ్గాగౌడ్‌, జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఓం ప్రకాష్‌, వెంకన్న, సతీష్‌, నహీర్‌అలీ, నరేందర్‌ గడ్‌, జాహీద్‌ హుస్సేన్‌,జాహీద్‌, రామకృష్ణ, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.

లోనవెల్లిలో కోనేరు వంశీ ప్రచారం

సిర్పూర్‌(టి): మండలంలోనిలోనవెల్లి గ్రామం లో సోమవారం సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తనయుడు కోనేరు వంశీ బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కోనప్పకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నమూనా ఈవీఎం ద్వారా అవగాహన కల్పిం చారు. అలాగే మండలకేంద్రంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండు ఏరియా, కాపువాడలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు.

Updated Date - 2023-11-27T22:48:02+05:30 IST