Share News

Kumaram Bheem Asifabad: రేపటి పోలింగ్‌కు సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-11-28T22:25:55+05:30 IST

ఆసిఫాబాద్‌, నవం బరు 28: ఈనెల30న జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కేంద్రఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ నితేష్‌కుమార్‌ వ్యాస్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీనుంచి వీడియోకాన్ఫరెన్స్‌ద్వారా రాష్ట్రంలోని అన్నిజిల్లాల ఎన్నికలఅధికారులు, పోలీసుఅధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad: రేపటి పోలింగ్‌కు సిద్ధంగా ఉండాలి

- కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ నతేష్‌కుమార్‌ వ్యాస్‌

ఆసిఫాబాద్‌, నవం బరు 28: ఈనెల30న జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కేంద్రఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ నితేష్‌కుమార్‌ వ్యాస్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీనుంచి వీడియోకాన్ఫరెన్స్‌ద్వారా రాష్ట్రంలోని అన్నిజిల్లాల ఎన్నికలఅధికారులు, పోలీసుఅధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులు, పోలీ సుశాఖ అధికారులు సమన్వయంతో ప్రశాంతవాతావరణంలో పోలింగ్‌ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో 001-సిర్పూర్‌, 005-ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్ని కలకు పూర్తిఏర్పాట్లతో సిద్ధంగాఉన్నామని తెలిపారు. ఎన్నికలసిబ్బంది మూడోవిడత ర్యాండమైజేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేశామన్నారు. జిల్లాలో గుర్తించిన 92 సమస్యా త్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌, సీసీకెమెరాల ఏర్పాటు, సూక్ష్మ పరిశీలకుల నియామకం, ఆయా నియోజకవర్గాల్లో విధులు కేటాయించబడిన అధికారుల తర లింపు, ఇతరాత్ర కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పోలింగ్‌ బందోబస్తుకు పది కంపెనీల సీఆర్పీఎఫ్‌ దళాలు, హోంగార్డులు, స్థానిక పోలీసు అధికారుల సమ న్వయంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లు కేటాయించామన్నారు. జిల్లాలో ఎన్నికలనిర్వహణకు ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు, సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - 2023-11-28T22:25:56+05:30 IST