Share News

Kumaram Bheem Asifabad : గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

ABN , First Publish Date - 2023-11-28T22:27:53+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 26: ప్రజలు ఏమనుకుంటున్నారు.. మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. మన పార్టీ గెలుపుపై ఏమైనా సదేహాలు ఉన్నాయా.. బూత్‌ స్థాయిలో నిఘా పెంచండి.. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును కలవండి.. ఇదీ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతున్న చర్చ.

Kumaram Bheem Asifabad :  గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

- ముఖ్య నేతలతో అభ్యర్థుల సమాలోచనలు

- ప్రలోభాలకు పదును పెడుతున్న వైనం

- ఇతర పార్టీల ఎత్తుగడలపై ఆరా

- ప్రజల మనోగతంపై వివరాల సేకరణ

ఆసిఫాబాద్‌, నవంబరు 26: ప్రజలు ఏమనుకుంటున్నారు.. మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. మన పార్టీ గెలుపుపై ఏమైనా సదేహాలు ఉన్నాయా.. బూత్‌ స్థాయిలో నిఘా పెంచండి.. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును కలవండి.. ఇదీ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతున్న చర్చ. మరో మూడు రోజుల్లో ఎన్నికలకు పోలింగ్‌ ఉండగా ఆయా పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెండు పర్యాయాలు అధికారాన్ని సొంతం చేసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈ సారి ఎన్నికలను గతం కంటే చాలెంజ్‌గా తీసుకున్నారు. ఓటుకు ఎంతైనా ఇచ్చి ప్రజలను తమ వైపున తిప్పుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

నేతలతో సమాలోచనలు..

దాదాపుగా జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నాయి. దీంతో నేతలు ప్రతిరోజు ప్రచారం ముగిసిన తరువాత రాత్రి వేళల్లో అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారాలు చేసి రాత్రి ముఖ్యనేతలతో మండలాల వారీగా మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బూత్‌స్థాయి నాయకులను, కార్యకర్త లను సైతం మచ్చిక చేసుకుని వారి ఆలనపాలన చూసు కుంటూ గెలుపు కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఓటరు నాడి పట్టడం అంత సులువు కానప్పటికీ బూత్‌స్థాయిలో ఉన్న నాయకుల చరిష్మాతో అభ్యర్థులు గెలుపుపై ఆశతో ఉన్నారు. దీనికోసం ప్రతిఓటుకు నోటు తప్పకుండా ఇవ్వాలని నిర్ణయిం చుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం గెలుపుపై ఎంతో ఆశతో ఉండడంతో డబ్బులు ఖర్చు పెట్టేందుకు వెనకడుగు వేయడం లేదని చెబుతున్నారు.

వన్‌సైడ్‌ ఓటర్లకు జాక్‌పాట్‌..

బూత్‌స్థాయిలో పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయనే దానిపై అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 500 ఓట్లకు ఒక ఇన్‌చార్జిని నియమించి ఓటు బ్యాంకును నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీకీ అనుకూలంగా ఉండే వ్యక్తులను జల్లెడ పడుతున్నారు. ఓటరుకు పంపిణీ చేసే డబ్బుల విషయంలో తమకు పక్కాగా పడే ఓట్లకు ఎంతైనా ఇవ్వాలనే ఆలోచనలతో ఉన్నారు. కొంత అసంతృప్తి, ఇతర పార్టీ నాయకులతో మచ్చి కగా ఉండే ఓటర్లకు తక్కువగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయిం చారు. దీంతో వన్‌సైడ్‌ ఓటర్లకు జాక్‌పాట్‌ తగిలినట్లే అవు తుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా బూత్‌ల వారీగా ఇన్‌చార్జీలు ఉన్నందున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు బూత్‌ స్థాయి నాయకులను సైతం అంతలా మర్యాద చేయడం లేదని అలకబూనారు. దీంతో ఇటీవల నాయకులు, కార్యకర్తలకు బూత్‌కు కొంత వరకు ఇవ్వడంతో జోష్‌ పెంచారు.

Updated Date - 2023-11-28T22:27:55+05:30 IST