Share News

Kumaram Bheem Asifabad: పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-11-27T22:41:32+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 27: అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్‌ మిశ్రా, దీపక్‌ మిశ్రా అన్నారు.

Kumaram Bheem Asifabad:   పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

- ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్‌ మిశ్రా, దీపక్‌ మిశ్రా

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 27: అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్‌ మిశ్రా, దీపక్‌ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సోమ వారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎన్నికల సాధార ణ పరిశీలకులు రాహుల్‌ మహివాల్‌, పోలీసు పరిశీలకుడు డీకే చౌదరి, జిల్లా ఎస్‌పీ సురేష్‌కుమార్‌తో కలిసి ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సిర్పూర్‌ (001), ఆసిఫాబాద్‌(005) నియోజకవర్గాలకు ఈ నెల 30న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూ చించారు. సిర్పూర్‌ నియోజక వర్గంలో 294, ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో 305 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. సిర్పూర్‌ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది, ఆసిఫాబాద్‌ నియోజక వర్గ పరిధిలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. సిర్పూర్‌లో 45, ఆసిఫాబాద్‌లో 47 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకు న్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T22:41:34+05:30 IST