Share News

Kumaram Bheem Asifabad: సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2023-11-27T22:43:41+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 27: అసెంబ్లీ నియో జకవర్గ సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యా త్మక పోలింగ్‌ కేంద్రా ల్లో సూక్ష్మ పరిశీల కుల పాత్ర కీలకమై నదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు.

Kumaram Bheem Asifabad:  సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 27: అసెంబ్లీ నియో జకవర్గ సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యా త్మక పోలింగ్‌ కేంద్రా ల్లో సూక్ష్మ పరిశీల కుల పాత్ర కీలకమై నదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాహుల్‌మహివాల్‌, పోలీసు పరిశీలకులు డీకే చౌదరితో కలిసి రెండునియోజకవర్గాల్లో ఉన్న92సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాల్లో నిర్వహించాల్సి న విధులు, పనులపై సూక్ష్మ పరిశీలకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికలఅధికారి మాట్లాడుతూ సిర్పూర్‌ (001), ఆసిఫాబాద్‌ (005) నియోజకవర్గాల పరిధిలో 92సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ఈనెల 30న పోలింగ్‌ కోసం పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆయాపోలింగ్‌ కేంద్రాలకు కేటాయించిన సూక్ష్మ పరిశీలకులు 29వతేదీ ఉదయం 10గంటలకు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. పోలింగ్‌కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, సీసీకెమెరాల ఏర్పాట్లపై పర్యవేక్షించాల న్నారు. తమ పోలింగ్‌కేంద్రం పరిధిలోని సెక్టార్‌అధికారితో సమన్వయంతో ఉండా లని తెలిపారు. పోలింగ్‌ రోజున ప్రతి రెండు గంటలకు పోలింగ్‌శాతంపై ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా పోలింగ్‌ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ క్రమంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమైనదన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలి..

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతిఒక్కరూ ఖచ్చితంగా పాటించా లని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. ఎన్నికల నిర్వ హణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు తాము చేస్తున్న బహిరంగ సభలు, ఎస్‌ఎంఎస్‌ ప్రచారాలను ఈనెల 28వ తేదీ సాయంత్రం 5గంటలకు ముగించాలని తెలిపారు. ఎన్నికల ప్రవవర్తన నియమావళి నిబంధనలను ఉల్లంఘించిన ట్లయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-11-27T22:43:43+05:30 IST