Share News

Kumaram Bheem Asifabad: ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

ABN , First Publish Date - 2023-11-28T22:21:58+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 28: జిల్లాలో అసెంబ్లీ ఎన్ని కలు సజావుగా సాగేందు కు రాజకీయ పార్టీలు, అ భ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే కోరారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌ భవన సమా వేశ మందిరంలో మంగళ వారం రాజకీయ పార్టీల ప్రతిని ధులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమా వేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad: ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ఆసిఫాబాద్‌, నవంబరు 28: జిల్లాలో అసెంబ్లీ ఎన్ని కలు సజావుగా సాగేందు కు రాజకీయ పార్టీలు, అ భ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే కోరారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌ భవన సమా వేశ మందిరంలో మంగళ వారం రాజకీయ పార్టీల ప్రతిని ధులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చి తంగా పాటించాలని చెప్పారు. తమ ప్రచారం ఎన్నికల నిబంధనలకు లోబ డి నిర్వహించాలని కోరారు. ఓటర్లకు మద్యం, నగదు, కానుకల పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేయకూడదని సూచించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 30 సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అ మలు ఉంటుందన్నారు. పోలింగ్‌ రోజున ఎన్నికల అధికారులకు సహకరించా లని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు సొంత స్థలానికి వెళ్లి పోవాలని చెప్పారు. పోలింగ్‌ కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజీకయ పార్టీల ప్రతినిధుల పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T22:21:59+05:30 IST