Share News

TS Elections: మద్యం అమ్మకాల బంద్.. హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు

ABN , First Publish Date - 2023-11-28T17:06:37+05:30 IST

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని పేర్కొన్నారు.

TS Elections: మద్యం అమ్మకాల బంద్.. హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ హైదరాబాద్ సీపీ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల ముగిసేవరకు 144 సెక్షన్ కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్మిగడితే చర్యలు తప్పవని సీపీ తెలిపారు. బార్లు, వైన్ షాపులు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశాలు ఇచ్చారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.

Updated Date - 2023-11-28T17:24:31+05:30 IST