Home » Telangana » Assembly Elections
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ( Minister Ashwini Vaishnav ) తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( MP Bandisanjay ) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 రోజులు రైలుని నడపాలని విన్నవించారు.
మహానగరంలో రోడ్డు దాటడం గగనంగా మారుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఎప్పుడు ఎవరిని బలిగొంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. పాదచారుల కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లు అలంకార ప్రాయం, అధ్వాన్నంగా మారాయి. ప్రారంభించిన శ్రద్ధ నిర్వహణలో లేకపోవడం పాదచారులకు శాపంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఎక్కువ రోజులు ఉండదని బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ( BJP ) ఎమ్మెల్యేలు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానగరంలో మూసీనది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatareddy ) సోమవారం (నిన్న) ఎంపీ పదవీకి రాజీనమా చేశారు. ఈ రాజీనామాని మంగళవారం (ఈరోజు) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా కోమటిరెడ్డి నియమితులయిన విషయం తెలిసిందే. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కోమటిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.
న్కో రాత పరీక్ష ( Genco Written Exam ) ను తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) వాయిదా వేసింది. ఈనెల17వ తేదీన జరగాల్సిన జెన్కో పరోక్షని వాయిదా వేశారు. ఇతర సంస్థల, ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉండడంతో జెన్కో రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని పలువురు నిరుద్యోగులు కోరారు.
దేళ్లలో బీఆర్ఎస్ ( BRS ) అందరినీ మోసం చేసిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ( V. Hanumantha Rao ) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టింది. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయదని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలి’’ అని వి.హనుమంతరావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ( BJP ) పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) కి కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత, చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అభిమానులు, పార్టీ నేతలు యశోద ఆస్పత్రికి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఓ వీడియోలో సందేశం ఇచ్చారు.