Share News

CM KCR: ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులే: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2023-11-19T16:17:32+05:30 IST

ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులేనని సీఎం కేసీఆర్(CM KCR) విమర్శించారు. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్(Alampur)లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ జరిగింది.

CM KCR: ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులే: సీఎం కేసీఆర్

అలంపూర్: ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులేనని సీఎం కేసీఆర్(CM KCR) విమర్శించారు. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్(Alampur)లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్(Congress) పార్టీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. "50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూశాం. ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ చూసిన ఆకలి చావులు ఉండేవి. అలాంటి రాజ్యం తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్ పాలన మళ్లీ అవసరమా? మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో రూ.1 కే కిలో బియ్యం ఇచ్చేవరకు ఆ తిప్పలు తప్పలేదు.


కాంగ్రెస్ హయాంలో పేదల కడుపు నింపాలని ఎవరూ ఆలోచించలేదు. బీఆర్ఎస్(BRS) పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. పొలాలకు 24 గంటల కరెంట్ ఇచ్చి వారిని వెన్నుదన్నుగా నిలిచాం. ఆర్డీఎస్‌పై తుమ్మిళ్ల ఎత్తిపోతల కట్టాం. దాని ద్వారా 35వేల ఎకరాలకు నీరు వస్తుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పూర్తి చేస్తాం. నెట్టెంపాడు 99-100 ప్యాకేజీ పెండింగ్‌ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశిస్తున్నాను.

కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛన్ ని రూ.2000లకు పెంచాం. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రానున్న 5 ఏళ్లలో పింఛన్ ని రూ.5 వేల వరకు పెంచుతాం. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ధరణి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. ధరణి పోతే పట్వారీ, లంచాల వ్యవస్థలు మళ్లీ వస్తాయి. 10 ఏళ్లుగా శాంతిభద్రతల పర్యవేక్షణలో దేశంలోనే నంబర్ 1 గా నిలిచాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి విజేయుడిని ఆశీర్వదించండి" అని కోరారు.

Updated Date - 2023-11-19T16:17:33+05:30 IST