Tenth paper leakage case: పేపర్ లీకులపై మరోసారి స్పందించిన హరీశ్‌రావు

ABN , First Publish Date - 2023-04-06T16:18:43+05:30 IST

పేపర్ లీకులపై మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మరోసారి స్పందించారు. బీఆర్ఎస్ (BRS) పిల్లలకు ఉచిత చదువులు చెబుతుందని

Tenth paper leakage case: పేపర్ లీకులపై మరోసారి స్పందించిన హరీశ్‌రావు

సంగారెడ్డి: పేపర్ లీకులపై మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మరోసారి స్పందించారు. బీఆర్ఎస్ (BRS) పిల్లలకు ఉచిత చదువులు చెబుతుందని, బీజేపీ (BJP) వాళ్లు మాత్రం పేపర్ లీకులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పేపర్ లీక్ చేసిన దొంగలను జైల్లో వేస్తే.. ఇవాళ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఏ పేపర్ కూడా లీక్ అవడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ దొరికిపోయిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసేదేం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi)పై కేసు వేస్తేనే ఏం చేయలేక పోయిందని విమర్శించారు. కూలగొడతా, కాలపెడతానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అంటాడు.. మరొకడు సమాధులు తవ్వుతా అంటాడు.. ఏమైతది తవ్వితే బొక్కలే బయటపడతాయని హరీశ్‌రావు అన్నారు.

సాధారణంగా పేపర్‌ లీక్‌ (Paper leak) అంటే.. పరీక్ష ప్రారంభం కావడానికి ముందే ప్రశ్నపత్రం బయటికి వస్తుంది. ప్రస్తుతం పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇచ్చిన తర్వాత బయటకు వస్తోంది. పరీక్ష కేంద్రంలోని సిబ్బంది ద్వారానే ఇది బయటకు వస్తోంది. దీనినిబట్టి ఈ వ్యవహారం పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ ఫోన్లను అనుమతించకూడదని స్పష్టమైన నిబంధన ఉన్నా.. అనేక కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారానే పేపర్లు బయటకు వస్తున్నాయి. జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసి, పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తే దీనిని కొంతమేరకు నియంత్రించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు మొదటి నుంచి కొంత ఉదాసీనత వైఖరితోనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-04-06T16:18:43+05:30 IST