Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు...

ABN , First Publish Date - 2023-03-23T15:15:17+05:30 IST

భారతీయుల వ్యక్తిగత డేటా (Personal Data)ను చోరీ (Theft) చేస్తున్న ముఠా (Gang) గుట్టు రట్టయింది. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు...

హైదరాబాద్: భారతీయుల వ్యక్తిగత డేటా (Personal Data)ను చోరీ (Theft) చేస్తున్న ముఠా (Gang) గుట్టు రట్టయింది. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆధార్ (Aadhar), పాన్ కార్డ్ (Pan Card), బ్యాంకు వివరాలను (Bank Details) కొట్టేసిన ముఠా నేరాలకు పాల్పడుతోంది. అంతేకాదు ఆ డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (CP Stephen Ravindra) మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్ల మందికి సంబంధించిన వ్యక్తి గత డేటాను ఈ ముఠా చోరీ చేసిందన్నారు. ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు అకౌంట్‌లకు సంబంధించిన పూర్తి డేటాను ఈ ముఠా దొంగిలించిందని, పలు ఆన్ లైన్ (Online) వెబ్ సైట్ల (Web Sites) నుంచి డేటాను చోరీ చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డేటాతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్ కార్డుల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న ఆర్గనైజేషన్ల నుంచి డేటాను చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొత్తం చోరీ చేసిన డేటాను ఈ ముఠా అధిక మొత్తంలో డబ్బుకు అమ్ముకుంటోందన్నారు. దేశ వ్యాప్తంగా చోరీకి పాల్పడ్డ నిందితులను గుర్తించామన్నారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రముఖంగా నాగపూర్, ఢిల్లీ, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించామన్నారు.

16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటీవ్ డేటాను సయితం అమ్మకానికి పెట్టారన్నారు. ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

Updated Date - 2023-03-23T15:15:17+05:30 IST