టీచర్ల బదిలీలకు సర్కారు సానుకూలమే: వినోద్‌

ABN , First Publish Date - 2023-02-19T03:40:03+05:30 IST

రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

టీచర్ల బదిలీలకు సర్కారు సానుకూలమే: వినోద్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యోగులందరూ ప్రభుత్వానికి ఎప్పటిలాగే సహకరించాలని కోరారు.

Updated Date - 2023-02-19T03:40:03+05:30 IST