Hyderabad: ఫిలిం ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం...

ABN , First Publish Date - 2023-02-20T10:44:54+05:30 IST

హైదరాబాద్: తారకరత్న అంత్యక్రియలు (Tarakaratna funeral) సోమవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం (Mahaprasthanam)లో జరగనున్నాయి.

Hyderabad: ఫిలిం ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం...

తారకరత్న అంత్యక్రియలు (Tarakaratna funeral) సోమవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం (Mahaprasthanam)లో జరగనున్నాయి. మోకిల నుంచి తారకరత్న పార్థివదేహం ఫిలింఛాంబర్‌ (Filmchamber)కు చేరుకుంది. అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్‌లోనే మధ్యాహ్నం వరకు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు.

ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ మోకిలలోని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన పార్ధివదేహాన్ని చూసి బాలకృష్ణ భావద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, అశ్వీనిదత్, రాజశేఖర్, ఆలీ, నారా రోహిత్, రవిబాబు తదితరులు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా జనవరి 27న నారా లోకేష్ (Nara Lokesh) తోపాటు తారకరత్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో పాల్గొన్నారు.. ఒక్కసారిగా కిందపడిపోవడంతో వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి (Narayana Hrudayalaya Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం (18వ తేదీ) మృతి చెందారు. అదే రోజు రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిలోని తారకరత్న నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందించినా ఫలించలేదు.

Updated Date - 2023-02-20T10:44:59+05:30 IST