Turkish Sufi Music: శిల్పకళా వేదికలో ఫిబ్రవరి 3న టర్కిష్ సూఫీ సంగీతం

ABN , First Publish Date - 2023-01-28T17:43:12+05:30 IST

టర్కీ (Turkiye) రాయబార కార్యాలయం, టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India)ల అధ్వర్యంలో నగరంలో తొలిసారిగా టర్కిష్ సంగీతాన్ని నగర వాసులకు అందించనున్నారు. సేమ పేరుతో

 Turkish Sufi Music: శిల్పకళా వేదికలో ఫిబ్రవరి 3న టర్కిష్ సూఫీ సంగీతం
హైదరాబాద్‌లో తొలిసారి..

టర్కీ (Turkiye) రాయబార కార్యాలయం, టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India)ల అధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో తొలిసారిగా టర్కిష్ సంగీతాన్ని నగర వాసులకు అందించనున్నారు. సేమ పేరుతో శిల్పకళా వేదిక (ShilpaKala Vedika)లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ప్రముఖ కొన్యా టర్కిష్ సూఫీ సంగీత (Turkish Sufi Music) బృందం ప్రదర్శన ఇవ్వనుంది.

ఈ సందర్భంగా టర్కీ కాన్సల్ జనరల్ ఓర్హన్ యల్మన్ ఒకన్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు భిన్నం అయినప్పటికీ సంస్కృతులు ఒక్కటే అన్నారు. టర్కీలో ప్రముఖమైన సూఫీ సంగీతాన్ని నగర వాసులకు అందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం అన్నారు. టర్కీ, హైదారాబాద్‌లు గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగి ఉన్నాయన్నారు. సూఫీ సంగీతాన్ని నగర వాసులు ఎంతగానో ఆనందిస్తారని అన్నారు. సూఫీ సంగీతంలో భాగంగా నెయ్, కుడుం, తంబుర, తెఫ్ తదితర వాయిద్యాలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారని అన్నారు.

బజాజ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ కరణ్ బజాజ్ (Bajaj Electronics CEO Mr.Karan Bajaj) మాట్లాడుతూ.. "టైమ్స్ ఆఫ్ ఇండియా ఈవెంట్ " విర్లింగ్ డెర్విషెస్‌తో అనుబంధించడం చాలా గొప్పగా అనిపిస్తుందన్నారు.. ఈ వేదిక సంగీతం, సంస్కృతులతో ఇరు దేశాల ప్రజలను ఏకం చేస్తుందనీ అన్నారు.

ట్రైడెంట్ సంస్థ జనరల్ మేనేజర్ ధీరజ్ మెహతా మాట్లాడుతూ.. “ట్రైడెంట్, హైదరాబాద్ టర్కిష్ కాన్సులేట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ హైదరాబాద్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2023-01-28T17:45:43+05:30 IST