Apsara Case : అప్సర గర్భంపై ట్విస్ట్.. తానెప్పుడూ శారీరకంగా కలవలేదన్న సాయికృష్ణ.. జనవరిలోనే..

ABN , First Publish Date - 2023-06-10T13:22:11+05:30 IST

అప్సర గర్భం విషయమై నిందితుడు సాయికృష్ణ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తానెప్పుడూ అప్సరను శారీరకంగా కలవలేదని తెలిపాడు. చెన్నైకు చెందిన బాయి ఫ్రెండ్‌తో అప్సరకు సంబంధం ఉందని వెల్లడించాడు. జనవరిలోనే తన గర్భం గురించి అప్సర చెప్పిందని సాయి కృష్ణ తెలిపాడు. తాను 3 నెలల గర్భవతిని అని జనవరిలో అప్సర చెప్పిందని.. అప్పుడే ఆమెపై అనుమానపడినట్టు సాయికృష్ణ వెల్లడించాడు.

Apsara Case : అప్సర గర్భంపై ట్విస్ట్.. తానెప్పుడూ శారీరకంగా కలవలేదన్న సాయికృష్ణ.. జనవరిలోనే..

Apsara Case : అప్సర గర్భం విషయమై నిందితుడు సాయికృష్ణ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తానెప్పుడూ అప్సరను శారీరకంగా కలవలేదని తెలిపాడు. చెన్నైకు చెందిన బాయి ఫ్రెండ్‌తో అప్సరకు సంబంధం ఉందని వెల్లడించాడు. జనవరిలోనే తన గర్భం గురించి అప్సర చెప్పిందని సాయి కృష్ణ తెలిపాడు. తాను 3 నెలల గర్భవతిని అని జనవరిలో అప్సర చెప్పిందని.. అప్పుడే ఆమెపై అనుమానపడినట్టు సాయికృష్ణ వెల్లడించాడు.

కాగా.. నిన్న రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినట్టు తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సాయికృష్ణ బోరున విలపించినట్టు సమాచారం. సాయికృష్ణ ప్రవర్తనను చూసి పోలీసులు భయపడిపోయినట్టు తెలుస్తోంది. తనను జైలుకి పంపినా సరే.. బతకనని సాయికృష్ణ చెప్పినట్టుగా తెలుస్తోంది. తనకు అసలు అప్సర ని చంపే ఉద్దేశం ఎట్టిపరిస్థితుల్లో లేదని.. పెళ్లి చేసుకోమని కొన్ని రోజులుగా టార్చర్ చేసిందని చెప్పాడట. పెళ్లి చేసుకోకపోతే.. తాము దిగిన ఫోటోలు, పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని అప్సర బెదిరించినట్లు సాయి కృష్ణ చెప్పాడు.

అంతకు ముందు పోలీసుల విచారణలో కూడా సాయికృష్ణ.. ‘అప్సర గర్భం దాల్చింది. అందుకు నేనే కారణమని పెళ్ళిచేసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ ఆమె వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. ఇవన్నీ భరించలేకే హత్య చేశాను’ అని వెల్లడించాడు. కాగా.. సాయి కృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం నిందితుడిని జడ్జి ఇంటి ముందు శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు హాజరుపరిచారు. సాయికృష్ణకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Updated Date - 2023-06-10T13:22:11+05:30 IST