Share News

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2023-11-29T00:22:54+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యాయని, తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

గోదావరిఖని, నవంబరు 28: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యాయని, తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 1ఇంక్లైన్‌ పై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో సింగరేణి కార్మికులు అనేక హక్కులను, డిమాండ్లను కోల్పోయారని చందర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలతో పాటు కార్మికుల వారసత్వ హక్కును పునరుద్ధరించారన్నారు. తెలంగాణ కోసం సింగరేణి కార్మికులు ఎలా కలిసికట్టుగా పనిచేశారో ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించేందుకు కూడా కార్మికులు కృషిచేయాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అన్నివర్గాల ప్రజ లకు ఏదో రకమైన ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనం అందుతుందన్నారు. కాం గ్రెస్‌, టీడీపీ, జాతీయ సంఘాలు చేసిన నిర్లక్ష్యంతోనే వారసత్వ హక్కులు గతంలో పోయాయన్నారు. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల కుంభకోణం చేస్తే బీజేపీ సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌పరం చేసే కుట్ర చేస్తున్నదని చందర్‌ ఆరోపించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నగర మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే మల్లయ్య, కార్పొరేటర్‌ ఇంజపురి పులేందర్‌, నాయకులు గండ్ర దామోదర్‌రావు, నూనె కొమురయ్య, కనకం శ్యాంసన్‌, జావిద్‌పాషా, వడ్డేపల్లి శంకర్‌, చెలుకలపెల్లి శ్రీని వాస్‌, లావుడ్య వెంకటేష్‌, జేవీ వెంకటేషం, మల్లారెడ్డి, రాజేశం, మండ రమే ష్‌, పుట్ట రమేష్‌, నారాయణ, నర్సయ్య, మల్లయ్య, శంకర్‌, శ్రావణ్‌, మల్లేష్‌, దాసరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:22:58+05:30 IST