Home » Telangana » Karimnagar
ఆశ్వీయుజ, శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు దేవీనవరాత్రులుగా జరుపుకుంటాం. ఆ తర్వాత రోజును దసరా పండుగగా పిలుస్తారు. దశమి నాడు ప్రారంభించే పనులు విజయవంతమవుతాయని నమ్మకం. విజయ ముహూర్తం కావడంతో ఈ రోజుకి విజయదశమి పేరు ఏర్పడింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా మెడికల్ హబ్‌గా మారుతోం ది. జిల్లా ఏర్పాటు తదుపరి వైద్య రంగంలో ఊహించని మార్పులొచ్చాయి. కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభు త్వ వైద్యం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ వానాకాలం సీజన్లో ప్రభుత్వ సూచన మేరకు ఎక్కువ మొత్తంలో రైతులు సన్న రకం వరి పంటనే సాగు చేస్తుండగా, తద్వారా వచ్చే పంటను సీఎంఆర్ కింద తీసుకునేందుకు రైస్ మిల్లర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సన్న రకం వరి ధాన్యం ఔట్ టర్న్ 67శాతం రాదని, 58 శాతం మాత్రమే వస్తుం దని చెబుతున్నారు. 58శాతానికి తగ్గించాలని, లేకుంటే క్వింటాలు ధాన్యానికి 300 రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్ల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం నిల్వల తరుగుదలపై 1శాతం డ్రైయేజ్ చార్జీలను చెల్లిం చాలని, రైస్‌మిల్లులో ధాన్యం నిల్వచేసినందుకు ప్రతి నెలా క్వింటాలు ధాన్యానికి 2.40 రూపాయల చొప్పున ప్రతి సీజన్‌కు రెండుసార్లు కస్టోడియన్ చార్జీలు ఇవ్వాలని, బియ్యం రవాణా, బ్లెండింగ్ చార్జీలు చెల్లించాలని కోరుతున్నారు.
చెడును తొలగించి మంచిని వెలిగించేదిగా దసరా పండుగను జరుపుకుంటారు. శక్తి స్వరూపిణి దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడ్ని వధించి లోకానికి మేలు కలిగించిందని ప్రతీతి. ఇదే రోజు రాముడు రావణడి సంహారం చేసినట్టుగా చెబుతారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన జిల్లా ప్రజలు విజయదశమి వేడుకలకు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజులు జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 40 వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిందని, అందకే ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని యాదవులపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనం నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహర్నవమి సందర్భంగా తొమ్మిదో రోజు శుక్రవారం నగరంలోని పలు ఆలయాల్లో, మండపాల్లో పూజలు, అలంకారాలు, అన్నదానాలు, అర్చనలు, అభిషేకాలు, హవనాలు నిర్వహించారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో సిద్ధిరాత్రి రూపంలో ఉన్న అమ్మవారికి పసుపు కుంకుమలతో మహిషాసుర మర్దనిగా విశేషాలంకారం చేశారు.
విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ అన్నారు. నగరంలో విజయదశమి పథ సంచాలన్ ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. గ్లోబల్స్కోప్ ఉన్న ఏకైక జాతీయ వాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నారు.
ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆర్‌ఈడీ, దక్షిణ) ప్రేం ప్రకాష్ రామగుండం ఎన్టీపీసీ లో పర్యటించారు.
పట్టణంలోని షిరిడీ సాయిబాబా ఆల యంలో ఆదివారం నిర్వహించే 106వ పుణ్యతిథి వేడుకలకు ఆలయం ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం లక్షకు పైగా భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.
గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ దశమి సందర్భంగా శనివారం నిర్వహించనున్న దసరా ఉత్సవాల వేడుకల ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు.