Share News

కౌంటింగ్‌లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2023-11-29T00:19:03+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత ప్రధానమని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు.

కౌంటింగ్‌లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర  కీలకం
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి

- జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి

కరీంనగర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత ప్రధానమని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సూక్ష్మ పరిశీలకులు(మైక్రో అబ్జర్వర్లు) శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియలో కళ్లు, చెవుల వంటి వారని, ఎలాంటి అవాంతరాలకు చోటు లేకుండా ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ మన సొంత పనిని ఎంత విధేయతతో చేస్తామో అదే విధంగా ఎన్నికల విధులను కూడా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి సదానందం, ఇతర అధికారులు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:19:20+05:30 IST