Share News

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2023-11-23T22:44:41+05:30 IST

వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన బాలపీరు(29) గురువారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ వేణు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి
బాలపీరు(ఫైల్‌)

బైక్‌పై వెళుతుండగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పాన్‌గల్‌, నవంబరు 23: వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన బాలపీరు(29) గురువారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ వేణు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాలపీరు ప్రైవేటుగా వనపర్తిలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం తన ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా, గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బాలపీరు ఎగిరి పక్కనే ఉన్న బండరాయిపై పడటంతో తీవ్ర రక్త గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. బాలపీరుకు భార్య శారద, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - 2023-11-23T22:44:42+05:30 IST