Share News

ఇందిరమ్మ రాజ్యం వస్తేనే.. ప్రాజెక్టులు పూర్తి

ABN , First Publish Date - 2023-11-21T23:17:54+05:30 IST

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తవుతాయని టీపీసీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో అనేక త్యాగాలు చేసిన వారి ఆత్మలు గోషిస్తున్నాయని చెప్పారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తేనే.. ప్రాజెక్టులు పూర్తి
బిజినేపల్లి సభలో అభ్యర్థి రాజేష్‌రెడ్డిని పరిచయం చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజానీకానికి ఆత్మగోస మిగిల్చిన కేసీఆర్‌

75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం కల్పించాలి

బిజినేపల్లి, అచ్చంపేట సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌/బిజినేపల్లి/అచ్చంపేట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తవుతాయని టీపీసీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో అనేక త్యాగాలు చేసిన వారి ఆత్మలు గోషిస్తున్నాయని చెప్పారు. కరీంనగర్‌లో ఓడిపోతానని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ను పల్లకీలో పార్లమెంట్‌కు పంపిస్తే యావత్తు తెలంగాణ ప్రజానీకానికి ఆత్మగోషను మిగిల్చారని దుయ్యబట్టారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి, అచ్చంపేటల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కూచకుళ్ల రాజే్‌షరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణలకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిజాం పరిపాలన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బూర్గుల రామకృష్ణారావుకు వచ్చిందని, 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ఆ అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూపకల్పన చేసింది కాంగ్రెస్‌ కాదా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ర్టాన్ని ఏలుతా..

ఎన్నికల రాజకీయాల కోసం కేసీఆర్‌ జిమ్మిక్కులు చేస్తే సహించే పరిస్థితుల్లో పాలమూరు జిల్లా వాసులు లేరన్నారు. నేను నల్లమల బిడ్డనని, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షత వహించే అవకాశం కల్పించిందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మీ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతాడంటూ రేవంత్‌రెడ్డి సెంటిమెంట్‌ను రాజేశారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ఇద్దరు జనార్దన్‌రెడ్డిల పరిస్థితి మీ అందరికీ బహిర్గతమేనని అన్నారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజు దాడులను తిప్పికొట్టడానికి పార్టీలతో నిమిత్తం లే కుండా ప్రతీ ఒక్కరు స న్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రె్‌స పార్టీ అధికారంలోకి వచ్చాక కేఎల్‌ఐ ద్వారా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించడంతోపాటు పాలమూ రు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద అన్ని ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేలా చర్యలు గైకొంటామన్నారు. బిజినేపల్లి సభలో ప్రసంగించిన టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కొదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖంలో అసహనం కన్పిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కీలక భూమిక పోషించిన అమరుల త్యాగాల ఊసురు ఆయనకు తగలక తప్పదని అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ నియోజక వర్గంలో ప్రజల నోటి కాడి బియ్యాని దోచుకున్న నాగం జనార్దన్‌ రెడ్డి, నల్లమట్టిని దోపిడీ చేసిన మర్రి జనార్దన్‌ రెడ్డిలు ఒక్కటై వస్తున్నారని, వారికి ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. మాజీ ఎంపీ డాక్టర్‌ మందా జగన్నాథ్‌ మా ట్లాడుతూ తెలంగాణలో జరగుతున్న ఎన్నికలు దొరల ఆహంకారానికి, అణచివేతకు.. సామాన్య ప్రజల ఆకలి కేకలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవా చేస్తున్నా అని, క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటూ తన కొడుకు డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డిని మీచేతుల్లో పెడుతున్నా అని అన్నారు. తనపై చూపిన ప్రేమ, అభిమానాలను తన కొడుకుకు పంచాలని అన్నారు. 30 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న నాగం జనార్దన్‌ రెడ్డి, పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్‌ రెడ్డిలు భూముల కబ్జాలు, నల్లమట్టి దోపి డీ, కాంట్రాక్టులతో ప్రజా ధనాన్ని లూటి చేశారని విమర్శించారు.

పదేళ్లుగా ఒక గూండా దాడి

అచ్చంపేట సభలో మాట్లాడుతూ చంద్రశేఖర్‌ రావు పాలనలో పదేళ్ల నుంచి ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక రౌడీ, గూండా గువ్వల బాలరాజు ప్రజల మీద దాడి చేస్తుంటే మౌనంగా, ఒప్పికతో ఉన్నామని, ఇక దాడులను తిప్పికొడ తామని అన్నారు. నల్లమలలోనే దాడులు చేసిన వారిని బొంద పెడుతామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మన ఊరికి గుడి, బడి వస్తే చంద్రశేఖర్‌ రావు పాలనలో రాష్ట్రంలో 1,800 బార్లు, 22 వేల వైన్స్‌లు, 62 వేల బెట్టు షాపులు వచ్చాయన్నారు. తమ యువకులు తల్చుకుంటే గడీల కోటల ఇటుకలను ఒక్కొక్కరు ఒక ఇటుక తీస్తే నేలమట్టం అవుతాయన్నారు. డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఇదే ఉత్సహంతో కదలిరావాలని అన్నారు. అనంతరం అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడారు. కార్యక్ర మంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.

కందనూలు గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం

నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి కూచకుళ్ల రాజే ష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి కందనూలు గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. తన తండ్రి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌ రెడ్డి నన్ను ప్రజల చేతుల్లో ఎందుకు పెట్టారో ఈసభకు ఆశేషంగా తరలివచ్చిన ప్రజల అభిమానాన్ని చూస్తే అర్థమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. పదేళ్ల రాజకీయ జీవితంలో మర్రి జనార్దన్‌రెడ్డి అవినీతి, అక్రమాలతో నల్లమట్టి దొంగగా పేరు తెచ్చుకున్నాడన్నారు. అదే తన తండ్రి 40 ఏండ్లుగా రాజకీయ రంగంలో ఉన్నా మచ్చలేని నాయకుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవడం నాకు గర్వంగా ఉందన్నారు.

సభలు సక్సెస్‌

బిజినేపల్లి, అచ్చంపేటల్లో సభలు సక్సెస్‌ కావడంతో శ్రేణుల్లో నూతనోత్సాహాం వెల్లివిరిసింది. వేలాది మంది రాకతో బిజినేపల్లిలో నాలుగు రోడ్లు జనసంద్రంగా మారాయి. గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. సభ విజయవంతం కావడంతో కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి గెలువడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-21T23:17:55+05:30 IST