‘పది’ తరగతి పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-04-04T00:53:45+05:30 IST

పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన తరగతి సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 12,221 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు 12,187 మం ది హాజరయ్యారు.

‘పది’ తరగతి పరీక్షలు ప్రారంభం
సూర్యాపేటలో పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు

భానుపురి, ఏప్రిల్‌ 3 : పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన తరగతి సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 12,221 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు 12,187 మం ది హాజరయ్యారు. 34మంది గైర్హాజరయ్యారు. 48 మంది ప్రైవేట్‌ విద్యార్థుల కు 41 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారని డీఈవో అశోక్‌ తెలిపారు. 69 పరీక్ష కేంద్రాలకు 43 పరీక్ష కేంద్రాలను నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ బృందాలు, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, విద్యాశాఖాధికారి, పరీక్షల విభాగం అధికారి తనిఖీ చేశారన్నారు. ఎటువంటి మాల్‌ ప్రాక్టిస్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

పరీక్షలతో పస్తులు

నడిగూడెం:పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్న భోజన ఏజెన్సీలను అనుమతించకపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి సోమవారం నడిగూడెంలో నెలకొంది. నడిగూడెం కొల్లు పాపయ్యచౌదరి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, గురుకుల కేంద్రాలలో 350మంది విద్యార్థులు పది పరీక్ష లు రాస్తున్నారు. మధ్యాహ్నం 6,7,8,9 తరగతులు నిర్వహించాల్సి ఉండగా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పాఠశాలకు దగ్గరల్లోని ఇళ్లకు వెళ్లి కొందరు తినిరాగా, సుమారు 60 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి నోచుకోలేపోయారు. భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఒకరోజు ముందే బియ్యం తీసుకొని వంటచేసి అందించాల్సి ఉండగా కలెక్టర్‌ సెట్‌ కాన్ఫరెన్సలో ఏజెన్సీలకు పరీక్ష కేంద్రాలతో అనుమతి లేదని చెప్పడం, ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రాల నిర్వహణలో బిజీగా ఉండటంతో మధ్యాహ్న భోజనాన్ని అందించలేకపోయారు. ఒక రోజు ముందుగానే బియ్యం అం దించి మంగళవారం నుంచి మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తామని, మొదటి రోజు కొంత అమోమయం నెలకొందని హెచఎం శోభనబాబు తెలిపారు.

Updated Date - 2023-04-04T00:53:55+05:30 IST