Home » Telangana » Nalgonda
భూమి, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం అగ్నికణంగా మారిందని అన్నారు.
మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఎస్ఐ అక్రమార్జన వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన ‘వసూల్ రాజా’ కథనం కలకలం రేపింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాల ఆధారంగా సదరు ఎస్ఐ వ్యవహారశైలిపై ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఆరా తీశారు.
ఆలేరు ఆస్పత్రిని 30 పడకల నుంచి 50కి పెంచేందు కు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నా రు. శుక్రవారం ఆలేరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతు కే.జెండగేతో కలిసి తనిఖీచేశారు.
అదనుతప్పి కురుస్తున్న వర్షాలతో రైతన్న ఆగమవుతున్నాడు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యేది వరి, పత్తి పంటలే. ఈఏడాది వర్షాకాలం ప్రారంభమై రెండున్నర మాసాలు గడిచాక,ఈ నెల లో కురిసిన వర్షాలు మినహా అంతకు ముందుకు భారీ వానలే లేవు.
సకలవిఘ్నాలు తొలగించే గణేశుడి నవరాత్రి ఉత్సవాలు శనివారం మొదలవనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక అలంకరణలతో మండపాలు సిద్ధంకాగా, వివిధ రూపాల్లోని వినాయక విగ్రహాలను మండపాలకు తరలించారు.
గుండాల మండలం సీతారాంపురం గ్రామంలోని ఎర్రబోళ్ల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరికి ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళన, బునాదిగాని, భీమలింగం కాల్వల ద్వారా గోదావరి జలాల సాధనకోసం పోరాటాలను నిర్వహించాలని మూసీ ప్రక్షాళన గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు పిలుపునిచ్చారు.
ప్రతీ నెలలో జరిగే సదరం శిబిరం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో టీ.నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పై చిత్రంలో కనిపిస్తున్నది బురదమడి కాదు..! మండల కేంద్రంలోని మెయినరోడ్ నుంచి అంగడిబజారు వరకు గుంతలయంగా మారిన రోడ్డు.
జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ భక్తిభావంతో గణేష్ నవరాత్రోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.