Share News

నిరుపయోగంగా పశుసంవర్ధక భవనాలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:54 AM

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ పశుసంవర్థక శాఖ కార్యాలయ ప్రాంగణంలోని భవనాలు నిరుపయోగంగా మారాయి.

నిరుపయోగంగా పశుసంవర్ధక భవనాలు

భానుపురి, జూలై 26 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ పశుసంవర్థక శాఖ కార్యాలయ ప్రాంగణంలోని భవనాలు నిరుపయోగంగా మారాయి. విశాలమైన ప్రాంగణంలో ఉన్న కార్యాలయాలన్నీ నూతనంగా నిర్మాణం చేసిన సూర్యాపేట సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోకి మార్చారు. దీంతో పాటు మత్స్యశాఖ కార్యాలయా న్ని సైతం కలెక్టరేట్‌కు మార్చడంతో ఈ భవనాలు మూతబడ్డాయి. సుమారు ఎనిమిది భవనాలు నిరూపయోగంగా ఉండడంతో పిచ్చిమొక్కలు పెరిగి ప్రాంగణం అధ్వానంగా మారింది. పశుసంవర్ధక కార్యాలయానికి గేట్లు సైతం లేకపోవడంతో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన భవనంలో ఎన్నడూ ఉపయోగించలేదు. దీనికి మాత్రం రెండు మూడు దఫాలు నిధులను కేటాయించి పూనులను పూర్తి చేసి నిరుపయోగంగా వదిలేశారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఇంజక్షన్లు సైతం డీఫ్రీజ్‌లో ఉండేందుకు నిర్మించిన గదులు సైతం నిరుపయోగంగా మారాయి. రైతుశిక్షణ క్షేంద్రంలో సైతం సమావేశాలు సక్రమంగా జగరడం లేదు. రెండు అంతస్తులో ఉన్న భవనంలో కింది భాగాన్ని ఇటీవల సూర్యాపేట ప్రాంతీయ పశుసంవర్ధక దవాఖానగా ఉపయోగపడుతోంది. మత్స్యశాఖ కార్యాలయానికి ఉపయోగించిన భవనం నిరుపయోగంగానే ఉండడం గమనార్హం. మరో భవనాన్ని నానగెజిటెడ్‌ అసోసియేషనకు కేటాయించినట్లు సమాచారం. పశుసంవర్థక శాఖ గోదాంగా మరో భవనాన్ని వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవనాలకు ఉన్న తలుపు లు చెదలు శిథిలావస్థకు చేరాయి. మరోవైపు తలుపులను ఆకతాయి లు విరగొట్టేస్తున్నారు. ఈ ప్రాంగణ సముదాయంలో చెట్లు ఎక్కువగా ఉండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి ఆధ్వానంగా తయారైంది. ప్రాంగణాన్ని వృథాగా ఉంచకుండా ఇతర కార్యాలయాలకు కేటాయిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:54 AM