Share News

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:47 AM

ప్రస్తుత వర్షాకాలంలో వ్యాపించే సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

ఆత్మకూరు(ఎం), జూలై 26: ప్రస్తుత వర్షాకాలంలో వ్యాపించే సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కప్రాయిపల్లిలో పరిసరాల పరిశుభ్రతను, మండ ల కేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. కప్రాయిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణ నీటి రింగుల్లో నిల్వ ఉన్న నీటిని చూసి ఎందుకు నీటిని తొలగించలేదని కార్యదర్శిని కలెక్టర్‌ ప్రశ్నించారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద కల్లాపి తొట్టిలో ఉన్న పేడ నీళ్లను చూసిన కలెక్టర్‌ తొట్టి ఖాళీ చేయించారు. వర్షాకాలంలో నీటి నిల్వ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించారా? అని ఏఎన్‌ఎం అశ్వినిని ప్రశ్నించారు. ప్రతీ శుక్రవారం డ్రైడే గా పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చేయాలని, వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం అందుతున్నాయా? అని బచ్చ అనూష అనే మహిళను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మండల కేంద్రంలో ని పీహెచ్‌సీని తనిఖీచేసి రికార్డులను క్షుణంగా పరిశీలించారు. రికార్డులో పేరు నమోదైన గర్భిణులు సకాలం లో చెకప్‌ చేయించుకునేలా ఏఎన్‌ఎంలు, ఆశాలు సహకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువ జరిగే విధంగా చూడాలని కలెక్టర్‌ సూచించారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, సరైన మందులు లేవని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంలేదని, రోగులు వస్తే సిబ్బంది పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరు తూ కాంగ్రెస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు పోతగాని మల్లే శం, తవిటి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఫార్మాసిస్టును పిలిచి కలెక్టర్‌ విషయం తెలుసుకోగా మందులు లేవని చెప్పాడు. వెంటనే కలెక్టర్‌ డీఎంహెచ్‌వోకు ఫోన్‌చేసి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు కావాల్సిన మందులు తెప్పించాలని ఆదేశించారు. తహసీల్దార్‌ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సఫియొద్దీన్‌, ఎంపీడీవో నిరంజన్‌, ఆర్‌ఐ మల్లికార్జునరావు, ఏపీవో బి.రమేష్‌, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

గుండాల: గుండాలలోని కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ గంగాధర్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వం ట గదులు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఏమైన సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ సురేశ్‌కుమార్‌, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, ఎంపీవో ధనుంజయ్‌ తదితరులున్నారు.

భువనగిరి అర్బన్‌: సుదీర్ఘ కాలంగా దళితులు కబ్జాలో ఉన్న భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు భట్టు రామచంద్రయ్య కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్ట ర్‌ హనుమంతు కే.జెండగేకు వినతిపత్రం అందజే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోత్కూరు మండలం ముశిపట్ల సర్వే నెం.194లోని 1.28 ఎకరాల్లో గత 30 ఏళ్లుగా కబ్జాలో ఉన్నారని తెలిపారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఆ భూమి రికార్డుల్లో నమోదు కానుందున గ్రామానికి చెందిన బిల్లపాటి యాదిరెడ్డి, మాధవరెడ్డి, కొప్పుల వెంకట్‌రెడ్డిలు దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు. సమగ్రంగా విచారణ జరిపి దళితులకు రావాల్సిన పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో గ్రామస్థులు మల్లయ్య, కిష్టయ్య, యాదమ్మ ఉన్నారు.

ప్రభుత్వ భూములు పరిరక్షించాలి

మోత్కూరు: మోత్కూరు చెరువు శిఖం సర్వే నెం.431లో అన్యాక్రాంతమైన 534 గజాల స్థలంతో పాటు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరు తూ మోత్కూరు మునిసిపాలిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ అన్యాక్రాంతమైన చెరువు శిఖిం భూమిపై విచారణ జరిపిస్తామని, ఆ భూమిపై కోర్టు ఆర్డర్లు ఉన్నా చెల్లవని కలెక్టర్‌ చెప్పారని అఖిల పక్ష నాయకులు విలేకరులకు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం నర్సింహ, అవిశెట్టి అవిలిమల్లు, గుండగోని రామచంద్రు, బయ్యని రాజు, అన్నెపు వెంకట్‌, మరాఠి అంజయ్య, గడ్డం లక్ష్మయ్య, పుల్కరం మల్లేష్‌, ఎస్‌.మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:47 AM