Share News

మృతుడి పేరిట మీటర్‌ కనెక్షన్‌కు దరఖాస్తు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:49 AM

మృతి చెందిన వ్యక్తి పేరిట నూతన విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ కుటుంబం మీటర్‌ బిగింపులో ఆలస్యమవుతోందని జేఎల్‌ఎంపై దాడి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈ సంఘటన జరిగింది.

మృతుడి పేరిట మీటర్‌ కనెక్షన్‌కు దరఖాస్తు

మీటర్‌ బిగింపులో ఆలస్యమవుతోందని జేఎల్‌ఎంపై దాడి

రాజీ కోసం యూనియన్‌, ఉద్యోగ సంఘాల యత్నాలు

భువనగిరి టౌన్‌, జూలై 26: మృతి చెందిన వ్యక్తి పేరిట నూతన విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ కుటుంబం మీటర్‌ బిగింపులో ఆలస్యమవుతోందని జేఎల్‌ఎంపై దాడి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈ సంఘటన జరిగింది. భువనగిరి పట్టణంలోని జలీల్‌పురకు చెందిన పాత ఇనుప సామాన్ల దుకాణం నిర్వాహకుడు అబ్ధుల్‌ గఫూర్‌ కొంతకాలం క్రితం మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు అతని పేరిట ఈ నెల 18న భువనగిరిలోని కన్జ్యూమర్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎ్‌ససీ)లో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేయగా, వారు టౌన్‌ ఏఈకి పంపారు. ఈ క్రమంలో విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌కోసం దరఖాస్తుదారులు సీఎ్‌ససీ సెంటర్‌కు వస్తూ ఆ ప్రాంత జేఎల్‌ఎం నీలం మహేష్‌ను ఫోన్‌లో సంప్రదిస్తున్నారు. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు తోడు, దరఖాస్తుదారుడు నేరుగా వచ్చి సంతకం పెట్టాలంటూ ఏఈ సాయికృష్ణ సూచించిన నేపథ్యంలో విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరులో జాప్యం జరిగింది. అయినప్పటికీ దరఖాస్తుదారులు జేఎల్‌ఎంను ఫోన్లలో దూషిస్తూ గురువారం స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలో మీటర్‌ రీడింగ్‌ తీసుకుంటున్న అతనిపై భౌతిక దాడికి దిగారు. దీంతో వెంటనే జేఎల్‌ఎం మహేష్‌ అదేరోజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన క్రమంలోనే దరఖాస్తుదారుడు గతంలోనే మృతి చెందినట్లు వెలుగుచూసింది. ఈ మేరకు జరిగిన ఉదంతంపై శుక్రవారం ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఆవరణలో అధికారులు ఉద్యోగులతో సమావేశంకాగా, స్థానిక రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు.

రాజీ కుదుర్చుకుందామంటూ ప్రతిపాదన

యూనియన్లు, ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలి జేఎల్‌ఎంపై దాడి చేసిన వారితో రాజీ కుదుర్చుకుందామంటూ ఓ వర్గం ప్రతిపాదించి ఒత్తిడి తెచ్చింది. మరో వర్గం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ ఫలించలేదు. బాధిత జేఎల్‌ఎంతోపాటు ట్రాన్స్‌కో అధికారులు, యూనియన్‌ నాయకులు స్వయంగా రెండు రోజుల క్రితం పోలీ్‌సస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సీఐ సురేష్‌కుమార్‌ తెలిపారు. అయితే తప్పుడు దరఖాస్తు చేసుకొని ఉద్దేశ్యపూర్వకంగా విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్‌ చేయాల్సిన అధికారులు, యూనియన్‌ నాయకులు అందుకు భిన్న వైఖరి పాటించడంపై క్షేత్రస్థాయి ఉద్యోగులు మండిపడుతున్నారు. భవిష్యత్‌లో కూడా దాడులు జరిగితే మాకు ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎ్‌ససీ సెంటర్‌ నిర్వహణ, సీఎ్‌ససీ సెంటర్‌లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా సీఎ్‌ససీ సెంటర్‌ నుంచి విద్యుత్‌ సర్వీ్‌సలను అక్రమమార్గంలో మంజూరు చేస్తున్నారని, ఈ అక్రమ పర్వంలో ఓ ముఖ్య ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ దరఖాస్తు, ఉద్యోగిపై దాడి కేసు రాజీలో కూడా ఆ ముఖ్య ఉద్యోగే కీలక పాత్ర పోషించాడని విమర్శలు వస్తున్నాయి. తమ ఉద్యోగిపై బహిరంగంగా జరిగిన దాడిపై కఠినంగా ఉండాల్సిన అధికారులు కూడా దాటవేత వైఖరి పాటిస్తున్న తీరుపై ఉద్యోగులతోపాటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jul 27 , 2024 | 09:04 AM