Share News

వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

ABN , First Publish Date - 2023-11-02T00:34:17+05:30 IST

గుర్తుతెలియని ఒక ఆగంతకుడు వివాహితపై దాడి చేసి గాయపర్చిన ఘటన బుధవారం జరిగింది.

వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

వలిగొండ, నవంబరు 1: గుర్తుతెలియని ఒక ఆగంతకుడు వివాహితపై దాడి చేసి గాయపర్చిన ఘటన బుధవారం జరిగింది. ఎస్‌ఐ ప్రభాకర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురానికి చెందిన నవీన ఆరు సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి వలిగొండ మండలం సంగెం గ్రామానికి జీవనోపాధి కోసం వలసవచ్చాడు. ఆ గ్రామంలో రైతు వద్ద వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వ్యవసాయ పనులు చేస్తున్న నవీన భార్యపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేసి గాయపర్చాడు. ఆ మహిళ కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. గాయపడ్డ మహిళను సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-11-23T07:22:31+05:30 IST