Share News

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-11-02T00:00:45+05:30 IST

జిల్లాలో అర్హత ఉన్న ఓటరు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు అన్నారు.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేటఅర్బన్‌, నవంబరు 1: జిల్లాలో అర్హత ఉన్న ఓటరు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద ఎపిక్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయు ధమని, ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అక్టోబరు రెండో వారంలో 48,544 కార్డులు, చివరి వారంలో 23,569 మొత్తం 72,113 ఎపిక్‌ కార్డులు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 34,180 కార్డులు వచ్చే శనివారం లోపు పోస్టల్‌ శాఖ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. మొత్తం 1,06,293 మంది అర్హులు ఎపిక్‌ కార్డులు సద్వినియోగం చేసుకోనున్నారని తెలిపారు. కార్యక్రమంలో పోస్ట్‌మాస్టర్‌ యాదగిరి, సూపరింటెండెంట్‌ వి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ పోస్టు మాస్టర్‌ బి. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం : ఎస్పీ

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఎస్పీ రాహుల్‌హెగ్డే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యత లేకుండా లేకుండా ప్రవర్తిస్తే న్యూసెన్స్‌ కేసులు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వారిపై మూడు నెలలుగా 1,350కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణ, మండల, నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు. జిల్లాకేంద్రంలోని శివారులు, జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు, కల్వర్టులు, పాత భవనాలు, పాత బస్‌షెల్టర్‌లు, పాఠశాలలు, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 350కి పైగా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, మహిళలకు ఇబ్బందులు కలిగించిన 100కుడయల్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2023-11-02T00:00:45+05:30 IST