Nizamabad Dist.: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి

ABN , First Publish Date - 2023-05-31T16:23:47+05:30 IST

నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాలు ఫ్యాక్చర్ అయింది.

Nizamabad Dist.: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి

నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ (Two cars collided) కొన్న ఘటనలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాలు ఫ్యాక్చర్ అయింది. దీంతో పాటు ఎమ్మెల్యే తమ్ముడు రాజేశ్వర్ రెడ్డితోపాటు మరో ముగ్గురు నేతలకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌లో ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బుధవారం కొన్ని వివాహ వేడులకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తున్న సమయంలో ముందుగా ఎమ్మెల్యే వాహనం వెళ్లింది. తర్వాత ఆయన సెక్యూరిటీ వాహనాలు రెండు వెళ్లాయి. ఆ తర్వాత ఆర్మూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మున్నాభాయ్‌కు సంబంధించిన వెహికల్ వెళ్లింది. పెరికి చౌరస్తా వద్ద కొద్ది దూరం వెళ్లిన తర్వాత మున్నాభాయ్ వాహనం డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో ఆ వెహికల్ వెనక ఉన్న కారులో నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఆ కారు మున్నాభాయ్ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో మున్నాభాయ్‌ కుడికాలు ఫ్యాక్చర్ అయింది. దీంతో ఆయనను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. వెనుక కారులో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-05-31T16:23:47+05:30 IST