Home » Telangana » Nizamabad
ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.
ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.
బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల నక్షత్రం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల నక్షత్రం వస్తుందని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.
Telangana: రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టమైనా.. ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని మరోసారి మంత్రి తుమ్మల స్పష్టంచేశారు.
కామారెడ్డి జీవధాన్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదవుతోంది. అయితే అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఓ కామాంధుడు.. బాలికపై కన్నేశాడు. రోజూ అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పాపులర్ అయ్యేందుకు ఔత్సాహికులు వింతవింత చేష్టలు చేస్తున్నారు. పది మందిలో విన్యాసాలు చేస్తూ కొంతమంది నవ్వులపాలు అవుతుంటే మరికొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు.
Telangana: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సిరికొండ మండలం జలదిగ్బంధంలో ఉండిపోయింది.సిరికొండ మండలానికి ఇతర ప్రాంతాలకు రాకపోకల బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.