Share News

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:19 PM

బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..
MP Suresh Kumar Shetkar

కామారెడ్డి: బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తు్న్న ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న అక్కచెల్లెమ్మలపై కేటీఆర్ నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. ఎంపీగా గెలిచిన తర్వాత మెుటదిసారి కామారెడ్డికి సురేశ్ షెట్కార్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సురేశ్ షట్కార్‌కు ఘనస్వాగతం పలికి సన్మానం చేశారు.


హరీశ్ రావు.. రాజీనామా ఎక్కడ?

ఈ సందర్భంగా ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ.. రైతులందరికీ రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేశాం. సాంకేతిక, ఇతర కారణాల వల్ల కొందరికి నగదు అందలేదు. అలాంటి వారు కంగారు పడాల్సిన పని లేదు. సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ అంశంలో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మి రైతులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దు. అందరి రుణాలూ మాఫీ చేస్తాం. రైతులందరికీ రుణ మాఫీ చేస్తే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరిప్పుడు రాజీనామా సంగతి ఏంటో హరీశ్ రావు చెప్పాలి.


150కోట్లతో అభివృద్ధి.. ఏమైంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రులపై గెలిచానని ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి చెప్పుకుంటున్నారు. గెలిస్తే రూ.150కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రమణారెడ్డి చెప్పారు. మరిప్పుడు ఏమైంది. మేము రోడ్లు వేస్తామన్నా, నీళ్ల ఇస్తామన్నా, బోర్లు వేస్తామన్నా రమణారెడ్డి ఒప్పుకోరు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని పనులు చేద్దామని వెళ్తే.. చేయడానికి నువ్వేవరూ అంటూ నేతలను ప్రశ్నిస్తారు. పోనీ ఆయన ఏమైనా చేస్తాడా అని చూస్తూ అదీ చేయరు. షబ్బీర్ అలీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే రమణారెడ్డి అడ్డుకుంటారు. పెద్ద మనసుతో ఆదరించి ఎంపీగా గెలిపించినందుకు కామారెడ్డి ప్రజల రుణం తీర్చుకుంటా. షబ్బీర్ అలీ సహకారంతో కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. రానున్న ఐదేళ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉంటా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది" అని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి:

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

Updated Date - Aug 18 , 2024 | 04:21 PM