Share News

రాష్ట్రంలో బీజేపీదే గెలుపు : రత్నం

ABN , First Publish Date - 2023-11-29T00:12:31+05:30 IST

కేసీఆర్‌ కుటుంబ పాలన, కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చెందాలంటే బీజేపీకి అధికారం ఇవ్వాలని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప, చేవెళ్ల అభ్యర్థి కేఎస్‌ రత్నం అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగాపురం, మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.

రాష్ట్రంలో బీజేపీదే గెలుపు : రత్నం
షాబాద్‌లో మాట్లాడుతున్న కేఎస్‌ రత్నం

చేవెళ్ల/శంకర్‌పల్లి నవంబరు 28 : కేసీఆర్‌ కుటుంబ పాలన, కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చెందాలంటే బీజేపీకి అధికారం ఇవ్వాలని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప, చేవెళ్ల అభ్యర్థి కేఎస్‌ రత్నం అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగాపురం, మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. గతంలో జడ్పీ చైర్మన్‌, చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచి సేవాలందించానని రత్నం తెలిపారు. కాలె యాదయ్య తొమ్మిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. చేవెళ్ల మండల పరిధిలోని చేవెళ్ల, కేసారం, ఊరెళ్లలో రత్నం సతీమణి ప్రమీల, కుమార్తె ప్రణీత గ్రామస్తులతో కలిసి ప్రచారం చేశారు. రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. జిల్లా అధికార ప్రతినిధి తొండరవి, మాజీ ఎంపీపీ నర్సింహ, నాయకులు రామకృష్ణ(చింటు), నాగరాజు, భుజాంగారెడ్డి, శ్రీనివాస్‌, బీరప్ప, కరుణాకర్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్‌, శ్రవణ్‌కుమార్‌, పవన్‌కుమార్‌, శ్రీకాంత్‌గౌడ్‌, పరమేశ్వర్‌రెడ్డి, వార్డు సభ్యులు, శివరాజ్‌, బోడ్డు శ్రీనివా్‌సరెడ్డి, అంజిరెడ్డి, ఐలయ్య, సింహరాజు, నందు, సురేష్‌, రాములుగౌడ్‌, రాజ్‌కుమార్‌ ఉన్నారు.

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి : కొండా

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేసి చేవెళ్లకు వచ్చారని ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసిన హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ చేయడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జీవో 111 తీసేసి.. జీవో 69 తీసుకువచ్చాడని చెప్పారు. మళ్లీ నెల రోజుల్లో జీవో 111ను పూర్తిస్థాయిలో ఎత్తివేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ చేస్తామంటున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఎలాంటి అబద్దపు హామీలిచ్చారో మళ్లీ వాటినే రిపీట్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల, కరీంనగర్‌, గజ్వేల్‌ తదితర నేషనల్‌ హైవే రోడ్లు బాగుచేసుకుని చేవెళ్ల నేషనల్‌ హైవే రోడ్డు మాత్రం బాగుచేయలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ ఉత్తర తెలంగాణకు మాత్రమే సీఎం అనుకుంటున్నారని ఆరోపించారు. మండలాధ్యక్షుడు పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు శర్వలింగం, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ఇంటికి పోవడం ఖాయం

షాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌ : చేవెళ్ల ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని బీజేపీ అభ్యర్థి రత్నం ప్రజలను కోరారు. మంగళవారం సాయంత్రం మొయినాబాద్‌, షాబాద్‌ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం స్వచ్ఛభారత్‌ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ రాము, మండలాధ్యక్షుడు కిరణ్‌, ప్రధాన కార్యదర్శి సురేష్‌, బీజేవైఎం మండలాధ్యక్షుడు మహేష్‌, నాయకులు రవీందర్‌రెడ్డి, మాణయ్య, మహేందర్‌, గోపాల్‌, మహేష్‌, క్యామ నారాయణ, విజయ్‌, సాయి, మండలాధ్యక్షుడు మధు సూదన్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌, అశోక్‌యాదవ్‌, చంద్రలింగంగౌడ్‌ నాయకులు కార్యకర్తలున్నారు.

Updated Date - 2023-11-29T00:12:32+05:30 IST