Home » Telangana » Rangareddy
గతంలో సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతూ కళకళలాడిన కాశనకుంట చెరువు నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టూ పరిశ్రమలు విస్తరించడంతో అవి వదులుతున్న వ్యర్థాలు నేరుగా వచ్చి చెరువులో చేరుతున్నాయి. దీంతో నీరంతా రంగు మారి దుర్గంధాన్ని వెదజల్లుతోంది.
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఓ తల్లి ఇద్దరు పిల్లలను తోసి తానూ దూకిన ఘటనలో కూతురు లావణ్య (18) కూడా మరణించింది. ఆమె మృతదేహాన్ని శుక్రవారం వెలికి తీశారు.
జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు కేవలం మద్యం సీసాల కోసం ఓ యువకుడిని హత్య చేశారు. బెల్టుతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సుద్ధగుంతలో పడేశారు. ఘటనా స్థలంలో దొరికన పర్స్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
పండుగలను భక్తి శ్రద్ధలతో సామర్యంగా జరుపుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ భవనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ భూముల విషయంలో ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పీరంపల్లి గ్రామంలో అధిక విస్తీర్ణంలో భూములు నమోదైన సర్వే నంబరు 709, 06లో భూములు, చౌడాపూర్ మండలంలోని లింగంపల్లి పరిధిలోని భూములను ఆయన పరిశీలించారు.
మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి సూచించారు. శుక్రవారం కేశంపేట మండల కేంద్రంలోని బీఎ్సవై గార్డెన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ మండపం ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు పోలీ్‌సశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో భార్య పిల్లలు లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రామన్నగూడలో చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వ్యక్తులు గీతం యూనివర్సిటీలో ఆడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.18.50 లక్షలు తీసుకొని మోసగించిన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పి.విఠల్‌రెడ్డి-ప్రభావతిలకు ఒక్కగానొక్క కూతురు ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్‌క్లా్‌సలో పాసయ్యింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీకి అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు కేవలం మద్యం సీసాల కోసం ఓ యువకుడిని హత్య చేశారు.