Share News

కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:51 PM

పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహాం లభ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. బొంగ్లూరు ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు కోయడ వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

ఇబ్రహీంపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహాం లభ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. బొంగ్లూరు ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు కోయడ వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. సీఐ, ఎస్సై బాల్‌రాజ్‌ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించగా చున్నీతో చెట్టుకు ఉరేసుకొని సుమారు (55) సంవత్సరాలు వయస్సు ఉన్న వ్యక్తి మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడు వారం క్రితం మృతిచెందినట్లుగా పోలీసులు బావిస్తున్నారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా ప్యాంటు జేబులో బీడీలు, అగ్గిపెట్టెతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా తాను చనిపోతున్నాను అంటూ తన కుమార్తె ఉమ ఫోన్‌నెంబర్‌ రాసి ఉన్న పేపరు కవర్‌లో దొరికింది. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్‌చేసి మృతుడి ఫొటో పంపించగా మృతుడు తన తండ్రి పోలు సుదర్శన్‌ రెడ్డి(56)గా కుమార్తె గుర్తించింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం గొర్రెంకపల్లికి చెందిన తాము మన్నెగూడలో నివాసం ఉంటున్నామని, తన తండ్రి బోర్‌వెల్స్‌లో పనిచేస్తాడని తెలిపింది. పది, పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి పోతుంటాడని, వారం నుంచి బోర్‌వెల్స్‌ పనికివెళ్లినట్లు తాము భావించామని తెలిపింది. ఈమేరకు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి మృతుడి భార్య సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 11:51 PM