సర్దార్‌నగర్‌లో ఒడిశా బృందం
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:13 PM
మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ పంచాయతీని ఒడిశా రాష్ర్టానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం సందర్శించింది.
షాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ పంచాయతీని ఒడిశా రాష్ర్టానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా పంచాయతీలో జరుగుతున్న ఆన్లైన్ సేవలు, రికార్డుల నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ అభివృద్ధికి నిధుల సమీకరణ, రాష్ట్ర నిధుల నిర్వహణ, ఉపాధిహామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనును పరిశీలించారు. నర్సరీ, సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రం, వైకుంఠధామాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణ మేనేజర్ అనిల్‌కుమార్, రుద్రయ్య, ఈవో శ్రీనివాస్, ఎంపీడీవో అపర్ణ, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో వీరాసింగ్, పంచాయతీ కార్యదర్శి కవిత పాల్గొన్నారు.