Share News

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యం

ABN , First Publish Date - 2023-11-29T00:15:10+05:30 IST

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని, మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని పామెన, అల్లావాడ, జాలగూడ గ్రామాలతోపాటు శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాల్లో ఆయా గ్రామాల్లో పర్యటించారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యం

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, నవంబరు 28 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని, మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని పామెన, అల్లావాడ, జాలగూడ గ్రామాలతోపాటు శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాల్లో ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌ తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంచారని చెప్పారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. కోతల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు తీశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ న్యాయకత్వంలో ప్రజలు మెచ్చేవిధంగా మేనిఫెస్టోను తయారు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి మనుగడ లేదన్నారు. గ్రామాల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌, చేవెళ్లలో యాదయ్యలు హ్యాట్రిక్‌ సాధిస్తారని చెప్పారు. ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, గుడిమాల్కపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ యాదగిరి, సర్పంచ్‌లు మల్లారెడ్డి, మోహన్‌రెడ్డి, విజయలక్ష్మీ, లావణ్యశంకర్‌, మార్కెట్‌ కమిటీ డైరెకర్లు కృష్ణ, వెంకటేశ్‌, మహేశ్‌, నియోజవర్గం యూత్‌ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి నరేందర్‌గౌడ్‌, చేవెళ్ల పట్టణా ధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, శంకర్‌, సామ రంగారెడ్డి, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, మోసిన్‌, జంగయ్య, దయాకర్‌, ప్రశాంత్‌, బాలయ్య, తదితరులు ఉన్నారు.

బీఆర్‌ఎ్‌సతోనే అన్ని వర్గాలకు లబ్ధి

షాబాద్‌ : బీఆర్‌ఎ్‌సతోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతోందని జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి అన్నారు. సంకేపల్లిగూడ, శేరిగూడ, సీతారాంపూర్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి చందన్‌వెళ్లి, సీతారాంపూర్‌లో పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పడ్డాయని, దీంతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు శ్రీనివా్‌సగౌడ్‌, వెంకటయ్య, సర్పంచులు పాండురంగారెడ్డి, దర్శన్‌, మాజీ సర్పంచ్‌ సురేష్‌, నాయకులు రాజు, వేమారెడ్డి, సీతారాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:15:11+05:30 IST