Share News

కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

ABN , First Publish Date - 2023-11-29T00:13:37+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఓటర్లు తనను నిండు మనస్సుతో ఆశీర్వదించి చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బీంభరత్‌ కోరారు.

కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
చేవెళ్లలో మాట్లాడుతున్న భీంభరత్‌

చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీంభరత్‌

చేవెళ్ల, నవంబరు 28 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఓటర్లు తనను నిండు మనస్సుతో ఆశీర్వదించి చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బీంభరత్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో పేద ప్రజల భూములను లాక్కొని.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే ఒకే ఇంట్లో ఇద్దరు అర్హులున్నా పింఛన్లు అందిస్తామన్నారు. చేయిగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానన్నారు. చేవెళ్ల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని ప్రజలను భీంభరత్‌ కోరారు. మార్పుకావాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలన్నారు. బీజేపీకి, బీఆర్‌ఎ్‌సకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను గద్దెదించాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల నియోజకవర్గ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, సమన్వయకర్త సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, మండల మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దేవర సమతారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోనే సరితారెడ్డి, ఎంపీటీసీ రాములు, సర్పంచ్‌లు రాజశేఖర్‌, బండారు శైలజాఆగిరెడ్డి, ఉప సర్పంచ్‌ గంగి యాదయ్య, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ నర్సింహరెడ్డి, మాజీ సర్పంచ్‌లు మధుసూదన్‌గుప్తా, ప్రభాకర్‌, గోపాల్‌రెడ్డి, నర్సింలు, మల్లేష్‌, అనంత్‌రాములుగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, జిల్లా ప్రదాన కార్యదర్శి యాలాల మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నాయకులు ప్రభులింగం, రామస్వామి, సత్తిరెడ్డి, దామోదర్‌రెడ్డి పి.మధుసూదన్‌రెడ్డి, బోజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఆశోక్‌, మల్లారెడ్డి, పారాయన్‌రెడ్డి, జనార్దన్‌, పెంటయ్యగౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణ, మైనార్టీ నాయకులున్నారు.

కాంగ్రె్‌సను గెలిపించాలి

షాబాద్‌ : కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు దొందూ దొందేనని, కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పామెన భీంభరత్‌ అన్నారు. మండల పరిధిలోని సర్దార్‌నగర్‌ సంతలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శులు పీసరి సురేందర్‌రెడ్డి, రాంరెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 4కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిందని తెలిపారు. మండలాధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌, ఎంపీటీసీలు చెన్నయ్య, అశోక్‌, మల్లేష్‌, మైనార్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి అశ్వక్‌అలీ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అశ్విని, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, రవీందర్‌, అక్తర్‌పాష, పీసరి వెంకట్‌రెడ్డి,విజయ్‌కుమార్‌రెడ్డి, పెంటారెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, యాదయ్య, నర్సింహులు, చంద్రయ్య, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీరాంరెడ్డి, జాకీర్‌హుసెన్‌, అంజనేయులుగౌడ్‌, శ్రీనివాస్‌, భార్గవరామ్‌, చిన్నయ్య, రవీందర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రషీద్‌పటేల్‌, బుడ్డయ్య, సుభా్‌షరెడ్డి, గౌరీశ్వర్‌, వెంకటేష్‌, రఘు, మాజీ సర్పంచులు చెన్నయ్య, యాదగిరి, బుచ్చయ్య, సత్యనారాయణ, రవీందర్‌నాయక్‌, రవి, పెంటయ్య, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:13:46+05:30 IST