Share News

సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీపీ ఇందిర

ABN , First Publish Date - 2023-11-29T00:17:03+05:30 IST

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ తెలిపారు.

సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీపీ ఇందిర
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ

కీసర, నవంబరు 28: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ తెలిపారు. ఆమె అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. వ్యయాలను ఎంపీడీవో గ్యామా తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉండటంతో ఎలాంటి తీర్మానాలు చేయకుండా నామమాత్రంగా సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ జలాల్‌పురం సత్తిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు తదితరులున్నారు.

Updated Date - 2023-11-29T00:17:04+05:30 IST