Share News

బాలికలు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-11-29T00:19:09+05:30 IST

బాలికలు క్రీడల్లో రాణించాలని వీబీఐటీ కళాశాల ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్‌ వీబీఐటీ కళాశాల వాలీబాల్‌ క్రీడాకారిణీలు హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఈ నెల 27న జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ద్వితీయస్థానం దక్కించుకున్నారు.

బాలికలు క్రీడల్లో రాణించాలి
గెలుపొందిన వాలీబాల్‌ జట్టు క్రీడాకారిణీలను అభినందిస్తున్న వీబీఐటీ కళాశాల ప్రిన్సిపాల్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 28: బాలికలు క్రీడల్లో రాణించాలని వీబీఐటీ కళాశాల ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్‌ వీబీఐటీ కళాశాల వాలీబాల్‌ క్రీడాకారిణీలు హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఈ నెల 27న జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ద్వితీయస్థానం దక్కించుకున్నారు. దీంతో మంగళ వారం జట్టు క్రీడాకారిణీలను మంగళవారం ప్రిన్సిపాల్‌, పీడీలు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలని, క్రీడలతో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. క్రీడల వల్ల మానసీక ప్రశాంతత, శారీరధారుడ్యం పెరుగుతుందన్నారు. అంతేకాకుండ క్రీడా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. బాలికలు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఎ హెచ్‌వోడీ పద్మ, పీడీ ఎం.శ్రీనివా్‌స రెడ్డి, శివలాల్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:19:24+05:30 IST