Share News

ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-11-29T00:15:58+05:30 IST

ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ జానయ్య తెలిపారు. మంగళవారం బొంరా్‌సపేట్‌ మండల పరిధిలోని తుంకిమెట్ల గ్రామంలో పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు.

ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
బొంరాస్‌పేట్‌: తుంకిమెట్లలో డీఎస్పీ జానయ్య ఆధ్వర్యంలో కవాతు

  • డీఎస్పీ జానయ్య

  • తుంకిమెట్లలో పోలీసు కవాతు

  • ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

బొంరా్‌సపేట్‌, నవంబరు 28: ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ జానయ్య తెలిపారు. మంగళవారం బొంరా్‌సపేట్‌ మండల పరిధిలోని తుంకిమెట్ల గ్రామంలో పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై భరోసా కలిగించేందుకే కవాతు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళాల తోడుగా ఉంటారని, ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేయాలని సూచించారు.

పూడూరు: ఎన్నికల్లో భాగంగా ఛన్‌గోముల్‌ పోలీసులు మంగళవారం పూడూరు మండల కేంద్రంతోపాటు మన్నెగూడ చౌరస్తాలో కవాతు నిర్వహించారు. ఎన్నికల వేళ ప్రజలంతా సహకరించాలని ఏఎ్‌సఐ సత్యం ఈ సందర్భంగా కోరారు.

మేడ్చల్‌ టౌన్‌: మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సజావుగా ఎన్నికలు నిర్వహించటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ సెంటర్ల వద్ద విధులు నిర్వహించే సీఐఎ్‌ఫఐ బెలాలియన్‌తో మేడ్చల్‌ పట్టణంలోని పలు కాలనీల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ను నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు ఓటర్లను కోరారు. ప్రలోబాలకు లొంగవద్దని ఈ సందర్భంగా సూచించారు.

దోమ: ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని దోమ ఎస్‌ఐరవిగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని వీధుల్లో కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:15:59+05:30 IST