Share News

KTR: పాలిచ్చే బర్రెను కాదని పొడిచే దున్నపోతును తెచ్చుకుంటారా?

ABN , First Publish Date - 2023-11-22T17:46:15+05:30 IST

పాలిచ్చే బర్రెను అమ్ముకొని పొడిచే దున్నపోతును తెచ్చుకుంటారా?, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని (BRS Government) వదిలేసి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారా?

KTR: పాలిచ్చే బర్రెను కాదని పొడిచే దున్నపోతును తెచ్చుకుంటారా?

హనుమకొండ: కాంగ్రెస్‌పై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముల్కనూరులో రోడ్ షోలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘పాలిచ్చే బర్రెను అమ్ముకొని పొడిచే దున్నపోతును తెచ్చుకుంటారా?’’ అని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని (BRS Government) వదిలేసి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారా? అని ఓటర్లను ప్రశ్నించారు. మొత్తం రూ.9.76 కోట్ల నిధులతో హుస్నాబాద్ అభివృద్ధికి, సంక్షేమం కోసం ఖర్చు చేశామని, 50 ఏళ్లు పాలించిన సన్నాసులే ఇవాళ ఒక్క ఛాన్స్ అంటున్నారని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి క్లబ్బులు పబ్బులే తెలుసు.. రైతుల కష్టాలు తెలియవని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-11-22T18:12:40+05:30 IST