Share News

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:27 AM

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...

అల్లూరి పార్కుకు రూ.50 లక్షల ఎంపీ నిధులు: అయ్యన్న

కృష్ణాదేవిపేట (అనకాపల్లి జిల్లా), జూలై 4: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు అభివృద్ధికి ఎంపీ సీఎం రమేష్‌ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తామని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అల్లూరి జయంతి సందర్భంగా కృష్ణాదేవిపేటలో గల ఆయన సమాధి వద్ద అయ్యన్నపాత్రుడుతో పాటు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జిల్లా కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి తదితరులు నివాళులర్పించారు.

Updated Date - Jul 05 , 2024 | 05:27 AM