Share News

AB Venkateswara Rao: ఏబీవీకి పోస్టింగ్.. ఏ విభాగంలో అంటే..?

ABN , Publish Date - May 31 , 2024 | 11:33 AM

సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఈ రోజు వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ వెంటనే పోస్టింగ్ ఇచ్చింది.

AB Venkateswara Rao: ఏబీవీకి పోస్టింగ్.. ఏ విభాగంలో అంటే..?

అమరావతి: కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులు మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.

TDP: చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో టీడీపీ సమావేశం


ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం కక్ష గట్టింది. ఆ వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అప్పడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేయాలంటే ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. పదవీ విరమణ రోజు విధుల్లో చేరుతున్నారు.

భోగాపురం భూములు.. భోంచేశారు!

Read more AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 12:19 PM