Share News

Yanamala: జగన్‌తో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా నోటీసు ఎదుర్కోక తప్పదు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:47 PM

అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు.

Yanamala: జగన్‌తో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా నోటీసు ఎదుర్కోక తప్పదు..

అమరావతి: అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి (Sakshi), దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి (YS Jagan) తో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా సభాహక్కుల కమిటీ నుంచి నోటీసు ఎదుర్కోక తప్పదన్నారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటవ్వగానే చట్ట సభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు (YCP Leaders) తమ జేబులు నింపుకున్నారన్నది వాస్తవమన్నారు. అందుకే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగి ఆదాయం లేదనే వాస్తవాల శ్వేతపత్రం ముఖ్యమంత్రి ప్రజలు ముందు పెట్టడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని యనమల అన్నారు.


శ్వేతపత్రం పై అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీకి రావాలి కానీ జగన్ ఢిల్లీ పోవటం, మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) విజయవాడ రాకుండా హైదరాబాద్ పోయి మాట్లాడటం వారిలో భయాందోళనకు నిదర్శనమన్నారు. జగన్ అప్పుల గురించి తప్పులు మాట్లాడుతూ ఇంకా దిగజారిపోతున్నారని యనమల విమర్శించారు. శ్వేతపత్రంలో అప్పులు అవాస్తమంటున్న జగన్.. తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆదాయం వచ్చిందన్నది వాస్తవమన్నారు. అయినా రూ.10 లక్షల కోట్లు అప్పు తెచ్చారంటే.. ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలన్నారు. ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు? ఎంత వృద్ధి సాధించారంటే జగన్ వద్ద సమాధానం లేదన్నారు.


తాను చెబుతున్నట్లు బ్రహ్మాండమైన పాలన అందించి ఉంటే ప్రజలు ఇంత ఘోరంగా తీర్పు ఇచ్చి ఉండేవారు కాదని జగన్ గ్రహించాలని యనమల అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని జగన్ అంటుంటే... తప్పు చేశాడు కాబట్టే పక్కన పెట్టామని ప్రజలు అంటున్నారన్నారు. అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచి, దానిని ప్రజలకు పంచటం తెలుగుదేశం ప్రభుత్వానికి తెలిసిన విద్య అని బుగ్గన గ్రహించాలన్నారు. జగన్ ఓటు ఆన్ అకౌంట్‌పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ఫ్రస్టేషన్‌లో ఉండి మాట్లాడుతున్నారని యనమల పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

జగన్‌ పత్రికకు జనం సొమ్ము

Read more AP News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 01:47 PM