AndhraPradesh: ఆమ్రపాలికి కీలక పోస్టింగ్
ABN , Publish Date - Oct 27 , 2024 | 08:39 PM
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఆదివారం పోస్టింగ్ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాటా ఆమ్రాపాలి, వాణి మోహన్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌లకు కీలక శాఖలు కేటాయించింది.
అమరావతి, అక్టోబర్ 27: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదివారం పోస్టింగులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా కాటా ఆమ్రపాలిని నియమించింది. అలాగే ఏపీ టూరిజం అధారిటీ సీఈఓగా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించింది. ఇక కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఏం ఏం నాయక్ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించే వారు. ఆయన్ని ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. అలాగే ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించింది.
Also Read: MahaRastra: మిగిలింది 48 గంటలే.. కొలిక్కి రాని పంచాయితీ
Also Read: Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు
జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి. వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీస్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న పోల భాస్కర్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.
Also Read: Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Telangana Politics: శుద్ధపూసలా మాట్లాడుతున్న కడియం శ్రీహరి
ఆంధ్రా కేడర్.. తెలంగాణలో విధులు
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్‌లంతా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ కేడర్ వాళ్లు.. సొంత కేడర్‌కు వెళ్లాలంటూ డీఏవోపీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వారంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. వారికి అక్కడ ఊరట దక్కలేదు. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సైతం వారికి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో వారంతా ఆంధ్ర్రప్రదేశ్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే వారిని రిలీవ్ చేశారు. వారంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. దాంతో వారికి ఆదివారం పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?
Also Read: రోజు బీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..
For AndhraPradesh News And Telugu News..