LIQUOR TENDERS: మద్యం షాపులకు 3వ రోజు దరఖాస్తులు నిల్
ABN , Publish Date - Oct 03 , 2024 | 11:46 PM
నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదని ఎక్సైజ్ సీఐ సృజనబాబు తెలిపారు.
పెనుకొండ టౌన, అక్టోబరు 3: నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదని ఎక్సైజ్ సీఐ సృజనబాబు తెలిపారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంవద్ద దరఖాస్తుల స్వీకరణ నిబంధనలను ఏర్పాటు చేశారు. సీఐ మాట్లాడుతూ పెనుకొండ పరిధిలో 13 మద్యం షాపులున్నాయని ఇందులో సోమందేపల్లి 3, పెనుకొండ 5, గోరంట్ల 4, రొద్దం ఒక షాపు ఉందన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
దరఖాస్తులు చేసుకోండి
హిందూపురం: ప్రైవేట్ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య ఓ ప్రకటనలో కోరారు. టెండర్ దాఖలు చేయడానికి మూడు బాక్సులు ఏర్పాటు చేశాన్నారు. దరఖాస్తు ఫారాలు స్టేషనలో అందుబాటులో ఉన్నాయన్నారు. 9వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. 10న దరఖాస్తుల పరిశీలన, 11న ఉదయం 8గంటలకు పుట్టపర్తిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు లక్కీ డ్రిప్ ద్వారా కేటాయిస్తారన్నారు. హిందూపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన పరిధిలో 6, రూరల్‌లో 1, లేపాక్షి 1, చిలమత్తూరు 1, పరిగి 2, మొత్తం 11మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందన్నారు.