Share News

remanded 8 మంది వైసీపీ నాయకుల రిమాండ్‌

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:39 AM

మండలంలోని కల్యం గ్రామంలో ఇటీవల జరిగిన గొడవకు సంబంధించి ఎనిమిదిమంది వైసీపీ నాయకులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

remanded 8 మంది వైసీపీ నాయకుల రిమాండ్‌

డీ.హీరేహాళ్‌, సెప్టెంబరు 6: మండలంలోని కల్యం గ్రామంలో ఇటీవల జరిగిన గొడవకు సంబంధించి ఎనిమిదిమంది వైసీపీ నాయకులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.


కల్యం గ్రామంలో గత మంగళవారం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడడంతో అతడిని చికిత్స కోసం అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాజు, జయరాం తదితరులు ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమయంలో వైసీపీ నాయకుడు లోకేష్‌ మరి కొందరు ఆటోకు అడ్డుగా నిలబడ్డారు. దీంతో రాజు, జయరాం ఆటోకు అడ్డు తొలగండని అడగ్గా.. మమ్మల్నే తప్పుకోమంటావా అంటూ వారు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో గాయపడ్డ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వైసీపీ నాయకుడు లోకే్‌షతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి రాయదుర్గం సివిల్‌ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించారు. వారిని అనంతపురం సబ్‌జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 07 , 2024 | 12:39 AM