Share News

తంగభద్ర వరద కాలువ నిర్మించండి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:14 AM

తుంగభద్ర నదికి వరదకాలువను నిర్మించి రాయలసీమను కరువు కోరల నుంచి కాపాడాలని జనవ రుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడును కోరినట్టు ఉమ్మడి జిల్లా సర్పంచల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్‌ తెలిపారు.

తంగభద్ర వరద కాలువ నిర్మించండి
మంత్రితో గోనుగుంట్ల భూషణ్‌

తాడిమర్రి, జూలై 26: తుంగభద్ర నదికి వరదకాలువను నిర్మించి రాయలసీమను కరువు కోరల నుంచి కాపాడాలని జనవ రుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడును కోరినట్టు ఉమ్మడి జిల్లా సర్పంచల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్‌ తెలిపారు. శుక్రవారం విజయ వాడ సచివాలయంలో ఆయన్ను కలిసి సమస్యను విన్నవించినట్టు చెప్పారు. పంచాయతీరాజ్‌ చాంబర్‌ జాతీయ అఽధ్య క్షుడు బాబురాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పూర్తీ వివరాలను మంత్రికి అందించామన్నారు.


తుంగభద్ర డ్యాం నుంచి వస్తున్న హెచఎల్‌సీ కెనాల్‌కు సమాం తరంగా వరదకాలువ నిర్మిస్తే అనంత పురం, కడప, చిత్తూరు వరకు ఈ వరద నీరు గ్రావీటీ ద్వారా తరలించవచ్చని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా పీఏబీ ఆర్‌, మిడ్‌పెన్నార్‌, చాగళ్లు, జీడిపల్లి, చిత్రావతి, గొల్లపల్లి, మారాల రిజర్వా యర్‌ లకు హెచఎల్‌సీ కెనాల్‌ను లింకప్‌ చేసి రా యలసీమ జిల్లాలను కాపాడాలని మంత్రి ని కోరినట్టు తెలిపారు. మంత్రి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 12:14 AM